రుద్రూర్, బతుకమ్మ: తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అని రుద్రూర్ మండల బ్లాక్ అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు నితిన్ పటేల్, ఉపాధ్యక్షులు అత్కూరి మహేశ్ ను ఘనంగా సన్మానించారు. మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, జహీరాబాద్ పార్లమెంట్ దిశ కమిటీ మెంబర్ నడిపింటి నగేశ్, పార్టీ గ్రామ అధ్యక్షుడు పార్వతి ప్రవీణ్ స్వామి, షేక్ నిస్సార్, పత్తి రాముస్వామి, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు తోట సంగయ్య, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ వడ్ల నరేశ్, కాంగ్రెస్ మాజీ యువజన అధ్యక్షుడు ఇందూర్ కార్తీక్ స్వామి, నాయకులు కుర్మాజీ సాయిలు, ఇమ్రాన్, సుదర్శన్ గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
