27 C
Hyderabad

ఇద్దరు పిల్లలతో కలిసి వాగులో దూకిన తల్లి

Must read

📰 Generate e-Paper Clip

పిల్లలు మృతి

మెదక్ జిల్లాలో తూప్రాన్ లో ఘటన

మెదక్, బతుకమ్మ : జీవితంపై విరక్తితో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి వాగులోకి దూకింది. ఈఘటన సోమవారం మెదక్ జిల్లాలోని తూప్రాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి మమత తన భర్త చనిపోవడంతో ఇద్దరి పిల్లలు పూజిత(7), తేజస్విని (5) లతో కలిసి తన తల్లి ఇంటి వద్దే ఉంటుంది. బ్రతుకు భారమై మమత తన ఇద్దరు పిల్లలతో కలిసి వాగులో దూకింది. అది గమనించిన స్థానికులుల ఆమెను బయటకు లాగగా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

More articles

Latest article