27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి తల్లీకొడుకు ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

  • 20రోజుల క్రితం భర్త ఆత్మహత్య
  • సంగారెడ్డి వాసులుగా గుర్తింపు

 

నిజాంసాగర్, బతుకమ్మ : మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం మునిగే పల్లి గ్రామానికి చెందిన దార ప్రమీల (30) భర్త దార సాయిలు గత 20రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గు వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. జీవితంపై విర్తకి చెందిన దార ప్రమీల తన కుమారుడు దార అక్షయ్ (8) తీసుకుని నిజాంపేట్ మండల కేంద్రంలోని బ్యాంకుకు వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లింది. గురువారం ఉదయం ప్రమీల, అక్షయ్ ల మృతదేహాలు నిజాంసాగర్ ప్రాజెక్టులో చేపలు పట్టే వారికి కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ శివకుమార్ పోలీస్ సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను ఒడ్డుకు తీయించి నిజాంపేట్ మండలం మునిగే పల్లి గ్రామానికి చెందిన దార ప్రమీల, అక్షయ్ లుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.

More articles

Latest article