జుక్కల్ మండలంలో విషాద ఘటన
కామారెడ్డి, బతుకమ్మ : కూలర్ నీటి తొట్టెకు విద్యుత్ సరఫరా కావడంతో తల్లి కూతుర్లు మృతి చెందిన విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జుక్కల్ మండలం పెద్దగుల్ల తండాకు చెందిన శంకబాయ్(34), ఆమె కూతురు శివాని (14) కూలర్ ఆన్ చేసి శుక్రవారం రాత్రి నిద్రించారు. కూలర్ లో సమస్య వచ్చి నీటి తొట్టెకు విద్యుత్ సరఫరా అయింది. నిద్రలో శివాని కాలు నీటి తొట్టెలో పడటంతో విద్యుత్ షాక్ తో కాలు కాలిపోయి, తల్లి కూతుర్లు అక్కడికక్కడే మృతి చెందారు. శంకబాయి కొడుకు ప్రతీక్ బయట నిద్రించడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
