కూలర్ నీటి తొట్టెకు విద్యుత్ సరఫరా.. షాక్ తో తల్లి కూతుర్లు మృతి
జుక్కల్ మండలంలో విషాద ఘటన కామారెడ్డి, బతుకమ్మ : కూలర్ నీటి తొట్టెకు విద్యుత్ సరఫరా కావడంతో తల్లి కూతుర్లు మృతి చెందిన విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జుక్కల్ మండలం పెద్దగుల్ల తండాకు చెందిన శంకబాయ్(34), ఆమె కూతురు శివాని (14) కూలర్ ఆన్ చేసి శుక్రవారం రాత్రి నిద్రించారు. కూలర్ లో సమస్య వచ్చి నీటి తొట్టెకు విద్యుత్ సరఫరా అయింది. నిద్రలో శివాని కాలు నీటి తొట్టెలో పడటంతో విద్యుత్ షాక్ తో కాలు...