30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

మనీ లాండరింగ్ కేసంటూ రూ.5.8లక్షల మోసం

Must read

📰 Generate e-Paper Clip

. కామారెడ్డిలో సైబర్ మోసం

. రికవరీ చేసిన పోలీసులు

కామారెడ్డి, బతుకమ్మ: గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ చేసిన వ్యక్తి తాను ముంబై పోలీసునని నీపై మనీలాండరింగ్ కేసు నమోదైందని ఓ వ్యక్తిని బెదిరించి రూ.5.8లక్షలు తన ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు.

వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి కి చెందిన రాజేందర్ కు ఇటీవల ఓ వీడియోకాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ముంబై పోలీసునని, నీపై మనీలాండరింగ్ కేసు నమోదైందని రాజేందర్ ను బెదిరించడం ప్రారంభించాడు. ఒక దశలో రాజేందర్ అవతలి వ్యక్తి మాటలు నమ్మాడు. దీంతో బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను తన ఖాతాకు జమ చేయాలని, లేకపోతే నిన్ను అరెస్టు చేస్తామని రాజేందర్ ను సైబర్ మోసగాడు బెదిరించడంతో అతడు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశాడు.

ఆ తరువాత తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వెంటనే అప్రమత్తమై సైబర్ మోసగాడి ఖాతాను ఫ్రీజ్ చేసి రాజేందర్ డబ్బులను రికవరీ చేశారు.

More articles

Latest article