27.3 C
Hyderabad
Friday, July 31, 2026

బిజినెస్ టీచర్లకే ఎమ్మెల్సీ టికెట్లు

Must read

📰 Generate e-Paper Clip

  • యూనియన్ లీడర్లయితేనే ప్రామాణికమా?
  • ఉపాధ్యయ వృత్తికి దూరంగా ఉన్న వారే లీడర్లా
  • ఎమ్మెల్సీ టికెట్ల కొనుగోలుకు కోట్ల రూపాయలా?
  • మాజీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు కలకలం
  • నిజామాబాద్, బతుకమ్మ :
    ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను తెలుసుకుని వాటిని చట్టసభల్లో ప్రశ్నించి న్యాయం చేసేందుకు నిర్ధేశించిన ఎమ్మెల్సీ టికెట్లు బిజినెస్ టిచర్లకు ఇవ్వడంపై కొత్త చర్చ జరుగుతుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ పూర్తయిన నేపథ్యంలో బరిలో నిలిచిన టీచర్ల వ్యవహరంపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 15 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం బరిలో నిలిచారు. అందులో సింహబాగం అంటే ఎనాడు ఉపాధ్యాయ వృత్తి లో రాణించి జాతీయ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహితల కంటే వృత్తిని వదిలీ వ్యాపార రంగంలో ఉన్నవారికి టికేట్లను ఇచ్చినట్లు నామినేషన్ ల ఉపసంహరణలో తెట తెల్లమైంది…..
    ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ తరువాత ఈ నెల రెండవ వారంలో హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం బరిలో నిలిచిన కూర రఘోత్తంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపాధ్యాయ రంగాన్నిఒక కుదుపు కుదిపాయి. ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీ టికెట్ లను రియాల్టర్లకు, కార్పొరేటర్లకు అమ్ముకున్నారని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాజ్యాంగం ఉపాధ్యాయుల ప్రాధాన్యతను గుర్తించి చట్టసభల్లో స్థానం కల్పించాలని ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ టికెట్లను పక్తు రాజకీయ పార్టీల మాదిరిగా వ్యాపారవేత్తలకు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయ వృత్తిని వదిలి వ్యాపార రంగంలో ఫక్తు కార్పొరేట్ గా వ్యవహరించిన వారికి టికెట్లను ఇవ్వడంపై ఉపాధ్యాయ లోకంలో యూనియన్లపై మండిపడుతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్ టీయూ నుంచి బరిలో దిగిన వంగ మహేంధర్ రెడ్డి, బీజేపీ తరపున బరిలో దిగిన కొమురయ్యలు ఉఫాధ్యాయ వృత్తిని వదిలి చాలా రోజులయ్యింది. వ్యాపార రంగంలో ప్రధానంగా కార్పొరేట్ విద్య వ్యవస్థతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో మునిగి తేలుతున్న వారు ఏ కోణంలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు న్యాయం చేశారని టికెట్లను కేటాయించారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాజీ పీఆర్ టీయూ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ టికెట్లను బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారని చేసిన వ్యాఖ్యలు చర్చ జరుగుతుంది.
    గతంలో పీఆర్ టీయూ ఎమ్మెల్సీలుగా పని చేసిన వారు ప్రభుత్వ పాఠశాలలకు, ఉపాధ్యాయులకు తమ ఎమ్మెల్సీ నిధులను కేటాయించిన దాఖలాలు లేవు. ఫక్తు పీఆర్ టీయూ భవనాలకు నిధులు కేటాయించిన ఎమ్మెల్సీలు ఏ విధంగా ఉపాధ్యాయులకు, విద్యారంగానికి సేవ చేశారని ప్రశ్నిస్తున్నారు. మహేంధర్ రెడ్డి ఉపాధ్యాయ వృత్తిని వదిలి రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి తన పేరు మీద ఎన్జీవో ద్వారా చేసిన సేవలు కేవలం ఆయన జిల్లాకే పరిమితం కాగా ఏనాడో యూనియన్ నాయకుడిగా పని చేసినందుకు టికెట్ ఎలా కేటాయిస్తారని చర్చ జరుగుతుంది. జాతీయ భావం కలిగిన భారతీయ జనతా పార్టీ తరపున బరిలో దిగిన కొమురయ్య కార్పొరేట్ స్కూళ్లను నడుపుతూ ఏనాడు పేద విద్యార్థులకు ఉచిత విద్యను, ఎంత మంది విద్యార్థులకు ఫీజులకు రాయితీ కల్పించడాని చర్చ జరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి లో ఎంతో మంది విద్యార్ధులను దేశ ఉత్తమ పౌరులుగా తీర్చీ దిద్ధి, ఉపాధ్యాయ రంగంలొ ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించడంలో రాజీలేని పోరాటం చేస్తున్న వారిని వదిలీ బిజినేస్ టీచర్లకు టికేట్ లను కేటాయించడంతో యూనియన్ లు సోంత ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. డజన్ మందికి పైగా బరిలో నిలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పటికే కులం ప్రాతిపాధికన టికేట్ల కేటాయింపు పై పెద్ధ ఎత్తున దూమారం రేపుతుండగా తాజాగా వ్యాపారవేత్తలకు టిచర్ ఎమ్మెల్సీ సీట్లా అనే చర్చ కుడా మొదలైంది.

More articles

Latest article