28.8 C
Hyderabad
Monday, August 3, 2026

తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : తనపై అనుచిత వ్యాఖ్యలు చేసీన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం హైదరాబాద్ లో డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తమ జాగృతి కార్యకర్తలపై దాడి చేయించింది తీన్మార్ మల్లన్న నా..? లేక ప్రభుత్వమా.. అనేది తెలియాలని డిమాండ్  చేశారు. దీని మీద సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే డీజీపీ ఆఫీస్ కి రాకపోవడం అంటే దీని వెనక ప్రభుత్వం కూడా ఉందని తాము అనుకోవాల్సి వస్తుందని అన్నారు. అసలు గన్ మెన్స్ ఎందుకు షూట్ చెయ్యాల్సి వచ్చిందనేది తెలియాలని డిమాండ్ చేశారు. మల్లన్న ఆదేశాలు లేకుండా గన్ మెన్స్ షూటింగ్ చెయ్యరని అన్నారు. తమ కార్యకర్తలపైన కాల్పులు జరిపిన తీన్మార్ మల్లన్న గన్మెన్లను వెంటనే డిస్మిస్ చెయ్యాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఏ గన్ మెన్ కానీ పోలీసులు కానీ కాల్పులు జరపలేదని, రోజు తీన్మార్ మల్లన్న గన్ మెన్స్ ఇలా కాల్పులు జరపడం బాధాకరమని అన్నారు.

MLC Kavitha files complaint against Teenmar Mallanna to DGP

More articles

Latest article