28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బీజేవైఎం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల చిత్ర పటాలకు పాలాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంజనీరింగ్ కళాశాల మంజూరు జరగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల కల నెరవేరిన వేళ విద్యార్థి సంఘాల పోరాటాలు, ఇక్కడి ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేని అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటులో బిజెపి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. భవిష్యత్తులో యూనివర్సిటీ అభివృద్ధిలో కూడా ఇదే రకమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ యూనివర్సిటీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ నాయకుడు, జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్, విజయ్ కృష్ణ, నరేష్, కార్తీక్ , విపుల్, అజయ్, సాగర్, యువమోర్చా నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article