27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  నాయకులు కార్యకర్తలు హాజరై కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని ఘనంగా జరుపుకున్నారు. ఇట్టి సందర్భంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జనహృదయనేతగా ఎదిగి జిల్లా ప్రజలకు అంకితభావంతో పనిచేసి మాజీ మంత్రిగా తన సేవలను కొనసాగించారని,ఆయన ఆయురారోగ్యాలతో భవిష్యత్తులో ఉన్నత పదవులను అధిరోహించాలని అన్నారు.కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి,గడ్డం జీవన్, పన్నాల నర్సారెడ్డి,కూరాకుల బో ర్రన్న,మూస్కుమోహన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి, బద్దం జితేందర్,గొల్ల వెంకన్న, మేకల సాయన్న,కూరాకుల సాయన్న,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article