ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు

బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  నాయకులు కార్యకర్తలు హాజరై కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని ఘనంగా జరుపుకున్నారు. ఇట్టి సందర్భంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జనహృదయనేతగా ఎదిగి జిల్లా ప్రజలకు అంకితభావంతో పనిచేసి మాజీ మంత్రిగా తన సేవలను కొనసాగించారని,ఆయన ఆయురారోగ్యాలతో భవిష్యత్తులో ఉన్నత పదవులను అధిరోహించాలని అన్నారు.కార్యక్రమంలో...