బతుకమ్మ బోధన్ : బోధన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన రెడ్డి పర్యవేక్షించారు. వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు, రోగుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. నెలకు 15 వేల ఔట్ పేషంట్లు, 7 వేల ఇన్ పేషంట్లు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆసుపత్రిలో 117 ప్రసవాలు జరుపుతున్నామని వెల్లడించారు. 15 రోజుల్లో కీలక సమస్యలు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల కొరత ఉన్నా, మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా ట్రైనీ నర్స్‌లతో సమావేశమై కేక్ కట్ చేశారు. ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. అవసరమైన యంత్రాలు, సదుపాయాలు త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆసుపత్రి సూపర్డెంట్ రాహుల్ ఆర్ఎంవో రహీం వైద్య సిబ్బంది ప్రవీణ్ సోఫీ నరేష్ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
