అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం

0 1,396

జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిట్లం మండల ఎమ్మార్వో, ఎంపీడీఓలతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం ఈ నెల 26 నుండి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయబోతుందని తెలిపారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్న సందర్భంగా వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అర్హులందరికీ ఈ పథకాలు అందేలా చూడాలని, పథకాల అమలులో ఎటువంటి నిర్లక్ష్యం, జాప్యం జరగకూడదని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.