24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మనసున్న మహారాజు ఎమ్మెల్యే పోచారం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

 

రుద్రూర్, బతుకమ్మ :

 

మనసున్న మహారాజు, బాన్సువాడ నియోజకవర్గ లక్ష్మీ పుత్రుడు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అని మాజీ విండో చైర్మన్ నాయకులు పత్తి రాము అన్నారు. రుద్రూర్ గ్రామానికి చెందిన 8 మంది లబ్దిదారులకు ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రుద్రూర్ గ్రామానికి చెందిన బాధితులు ఆరోగ్య రీత్యా వివిధ హాస్పిటల్లో చికిత్సలు చేసుకొని, చికిత్సలకు సంబంధించిన హాస్పిటల్ బిల్లులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పోచారం వారి పీఏ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ప్రాసెస్ చేసి సాంక్షన్ చేయించి మంజూరైన చెక్కులను మండల నాయకుల ద్వారా లబ్ధిదారులకు రూ.239500 పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పత్తి రాము మాట్లాడుతూ ఇలా గత 12, 13 సంవత్సరాల నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా రుద్రూర్ గ్రామానికి, మండలంలోని గ్రామాలకి 100 ల సంఖ్యలో ఎన్నో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే కాకుండా ఎల్ఓసి చెక్కులను కూడా మంజూరు చేయించి పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆయనకు మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షులు, డీసీసీ కార్యదర్శి పత్తి రాము, వర్ని మార్కెట్ కమిటీ డైరెక్టర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్వతి ప్రవీణ్, నాయకులు అక్కపల్లి నాగేందర్, బుర్కా మారుతి పాల్గొన్నారు.

More articles

Latest article