27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కళాశాల భూముల విషయంలో జరిగిన అక్రమాలకు పూర్తి బాధ్యత ఎమ్మెల్యే దే

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

అరోరా ఇంజనీరింగ్ కళాశాల భూముల విషయంలో జరిగిన అక్రమాలకు పూర్తి బాధ్యత ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి దే అని విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. శుక్రవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆరోర ఇంజనీరింగ్ కళాశాలకు కేటాయించిన భూములను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు డిగ్రీ కళాశాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేశామని, ఎలాంటి తీర్మానం లేకుండా కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ లో మీ పేరు ఎలా వచ్చిందో తెలిపాలని అన్నారు. భూమిని తాకట్టు పెట్టి లోను తీసుకున్నది వాస్తవం కాదా అని, బ్యాంకు వాళ్లు కళాశాల భూములను సీజ్ చేయడానికి వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదని, మీ నాన్న దగ్గర ఉండాల్సిన కళాశాల ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇంజనీరింగ్ కళాశాల యజమాన్యం చేతులకు ఎలా వెళ్ళిందని అన్నారు. మీరు మెంబర్ గా ఉన్నపుడు డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్తున్న మీరు, అరోరా ఇంజనీరింగ్ కళాశాల విషయంలో యూకో బ్యాంకులో లోన్ లేపింది వాస్తవం కాదా అని, మీరు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో మీ వాటా ఎంత ఉందో బహిర్గతం చేయాలన్నారు. డిగ్రీ కళాశాల భూములలో కబ్జా చేసిన ప్రతి దాన్ని సందర్శించి ప్రజల వాస్తవాలను బయట పెడతామన్నారు. ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని డిగ్రీ కళాశాల స్వాధీనం చేసుకొని వసతి గృహాలుగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆజాద్, సందీప్ కుమార్, జీవియం విఠల్, అరుణ్, లక్ష్మణ్, నాగరాజు, భారత్, వినోద్, సోఫియన్, డేవిడ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

MLA is fully responsible for irregularities in college land deal

 

More articles

Latest article