కళాశాల భూముల విషయంలో జరిగిన అక్రమాలకు పూర్తి బాధ్యత ఎమ్మెల్యే దే
కామారెడ్డి, బతుకమ్మ : అరోరా ఇంజనీరింగ్ కళాశాల భూముల విషయంలో జరిగిన అక్రమాలకు పూర్తి బాధ్యత ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి దే అని విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. శుక్రవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆరోర ఇంజనీరింగ్ కళాశాలకు కేటాయించిన భూములను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు డిగ్రీ కళాశాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేశామని, ఎలాంటి తీర్మానం లేకుండా కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ లో...