29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రైతుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

 

. . . చడ్మల్ తండాలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

 

గాంధారి, బతుకమ్మ :

 

గాంధారి మండలంలోని చడ్మల్ తండా గ్రామంలో బుధవారం పీఏసీఎస్ గాంధారి ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కొనుగోళ్లను ప్రారంభించారు. ఇటీవల చడ్మల్ తండా గ్రామంతో పాటు పరిసర గ్రామాల రైతులు ఎమ్మెల్యే మదన్ మోహన్ ని కలిసి తమ ప్రాంతంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే సానుకూలంగా స్వీకరించి సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి చడ్మల్ తండాలో కొనుగోలు కేంద్రం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణ ఫలితంగా నేడు చడ్మల్ తండా గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభమై కొనుగోళ్లు మొదలయ్యాయి. దీంతో రైతులు తమ పంటను స్థానికంగానే విక్రయించుకునే అవకాశం లభించడంతో రవాణా ఖర్చులు, సమయ నష్టం తగ్గనున్నాయన్నారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని వెంటనే స్పందించి జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కి చడ్మల్ తండా, పరిసర గ్రామాల రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article