మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 6100 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నట్లు ప్రాజెక్ట్ ఏఈఈ రవి తెలిపారు. జూన్ నెల మొదటి రోజు నుండి ఇప్పటివరకు 9.384 టీఎంసీల నీరు వచ్చి చేరిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా గురువారం 1067.90 అడుగులు, 20.006 టీఎంసీల నీరు నిలువ ఉంది.
