మెండోరా,బతుకమ్మ: గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు శ్రీరాంసాగర్ జలాశయం లోకి ఎగువ ప్రాంతాల నుంచి వర్షం నీరు రిజర్వాయర్ లోకి 2789 క్యూసెక్కుల వర్షం నీరు వచ్చి చేరిందని ప్రాజెక్ట్ ఏఈఈ రవి తెలిపారు. ఆవిరి రూపంలో 321 క్యూసెక్కుల నీరు పోగా, మిషన్ భగీరథ నీటి కోసం 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా శనివారం రోజు 1061.50 అడుగులు, 11.965 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత సంవత్సరం ఇదే రోజు 1056.30 అడుగులు, 7.488 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. అలాగే నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
