ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి మండలంలోని పదవ తరగతి (ఎస్ ఎస్ సీ) వార్షిక పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయో లేదో తెలుసుకోవడానికి అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. శనివారం ఎల్లారెడ్డి మండల పరిధిలో ఉన్న మూడు ఎస్ఎస్ సీ పరీక్షా కేంద్రాలను స్థానిక పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ మహేష్, మండల విద్యా అధికారి (ఎంఈఓ) రాజు కలిసి సందర్శించారు. ఈ తనిఖీల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ శ్రీనివాస్, నాయబ్ తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఎల్లారెడ్డి అధికారుల బృందం కూడా పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, భద్రతా చర్యలు, పరీక్షా నిర్వహణ విధానాలను అధికారులు పరిశీలించారు. పరీక్షలు నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ పరీక్షలు రాయాలని సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్ వంటి అక్రమాలకు అవకాశం లేకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు పరీక్షా సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తూ, పరీక్షల నిర్వహణలో పూర్తి అప్రమత్తతతో పని చేయాలని సూచించారు.

