29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

యోగాసనాల ద్వారా మానసిక సమతుల్యత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : క్రమ పద్ధతిలో యోగాసనములు, ప్రాణాయామము, ధ్యానము  ప్రతి నిత్యము చేయడము వలన శారీరక మరియు మానసిక సమతుల్యతను పొంది వ్యాధులు  రాకుండా చూసుకోగలమని జిల్లా ఆయుష్ నోడల్ అధికారి, జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షులు జె.గంగదాస్ అన్నారు. 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం యోగ వాక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.   జిల్లాలో 16 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో యోగ  షెడ్డులు నిర్మించి ప్రతి రోజు, ఇద్దరు పురుష , స్త్రీ యోగ  శిక్షకుల ద్వారా శిక్షణ ఇవ్వడము జరుగుతుందని తెలిపారు. ఈ సదవకాశాన్ని జిల్లా ప్రజలందరు ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ  మాట్లాడుతూ, వయసుకు సంబంధం లేకుండా అందరూ యోగ చేయవచ్చునని , గర్భిణీ స్త్రీలు, బీపీ, షుగర్, ఉబకాయము, గుండె జబ్బులకు యోగా సాధన చేయడము చక్కటి మార్గమని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షుడు యోగ ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు యోగ రామచందర్, కార్యదర్శి సంగీత , యోగ  గురువులు ఎచ్ శ్రీనివాస్, ఐశ్వర్య , తేజస్విని , దయానంద  యోగ కేంద్ర  సభ్యులు రుక్మయ్య  కిషన్, భూమయ్య  జిల్లా యోగ   అసోసియేషన్ సభ్యులు, పతంజలి యోగ సభ్యులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధి తోట రాజశేఖర్, యోగ సిద్ధిరాములు ,    పట్టణ ప్రజలు  మరియు  యునాని సీనియర్ వైద్య అధికారి    డాక్టర్  ఫసియొద్దిన్,   ఆయుష్  డీపీఎం వందనా,   డాక్టర్  వెంకటేష్, డాక్టర్ తిరుపతి, ఆయుష్ ఫర్మసిస్ట్లు పురుషోత్తం, ఉమా ప్రసాద్,   సబియా, సిబ్బంది రమేష్, భిక్షపతి,   విట్టోబా యోగా  ఇంస్ట్రక్టర్లు విజయ భాస్కర్, సంగీత, నమ్రతా పాల్గొన్నారు.

Mental balance through yoga asanas

More articles

Latest article