30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇద్దరు బల్దియా ఉద్యోగులకు మెమోలు

Must read

📰 Generate e-Paper Clip

. చర్యలు తప్పవని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ మకరంద్

. సమయపాలన పాటించాలని సర్క్యులర్ జారీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగులు తమకు ఇష్టమొచ్చిన సమయంలో విధులకు హాజరువుతున్న వైనాన్ని ఎత్తి చూపుతూ ‘బతుకమ్మ’లో ‘అడిగేవారెవరు?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కమిషనర్ మంద మకరంద్ స్పందించారు. ఉద్యోగుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కార్యాలయానికి ఆలస్యంగా వచ్చి రిజిస్టర్ లో సంతకాలు చేసిన ఇద్దరు ఉద్యోగులకు మెమొలు జారీ చేశారు. ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డితోపాటు టౌన్ ప్లానింగ్ సెక్షన్ చైన్ మన్ స్వామికి నోటీసులు అందాయి. మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేసే ఉద్యోగులు ఉదయం 10.30గంటల వరకు కార్యాలయానికి చేరుకోవాలని కమిషనర్ సర్క్యులర్ జారీ చేశారు. సమయపాలన పాటించని వారిపై చర్యలు తప్పవని సర్క్యులర్ లో స్పష్టం చేశారు.

More articles

Latest article