24.1 C
Hyderabad
Monday, August 3, 2026

జనసేన పార్టీ తరపున సభ్యత్యం నమోదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రూ 5 లక్షల బీమా సౌకర్యం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్యం నమోదు కార్యక్రమాన్ని గౌలి గూడా హనుమాన్ మందిరం లో ప్రత్యేక పూజలు నిర్వహించి, బాన్సువాడ నియోజకవర్గం పి ఓ సి మెంబర్ రవీందర్ చౌహన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.400 లతో సభ్యత్వం తీసుకున్న ప్రతి జన సైనికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆర్థికంగా రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుందని వెల్లడించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తను నాయకులుగా తీర్చిదిద్దడమే కాకుండా, జనసేన పార్టీలో రానున్న కమిటీలలో బాధ్యత గల పదవిలో సభ్యత్వం తీసుకున్నకార్యకర్తలకు అవకాశం దక్కుతుందన్నారు. అంతేకాకుండా గ్రామ గ్రామాన పార్టీ బలోపేతాని కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్, దుర్గ ప్రసాద్, సాయి కృష్ణ, మంగ్రామ్ పాల్గొన్నారు.

More articles

Latest article