25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల పై చర్చించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ..  ఈనెల సెప్టెంబర్ 17 న తెలంగాణ వియోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి,  సెప్టెంబర్ 17 న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదినం సందర్భంగా ఉదయం రుద్రూర్ గ్రామంలోని అంగడి బజార్ నందు వినాయకుడి మందిరంలో మోదీజీ  పేరు మీద అర్చన కార్యక్రమం నిర్వహించి, ఆ తరువాత రుద్రూర్ గ్రామంలో  వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బాన్సువాడ బిజెపి నాయకులు, ఎన్నారై కోనేరు శశాంక్, రుద్రూర్ మండల స్థానిక సంస్థల ఎన్నికల ఇంచార్జ్  డాక్టర్ పుట్ట వీరేందర్, మండల ప్రధాన కార్యదర్శిలు ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, ఉపాధ్యక్షులు రేపల్లె సాయి ప్రసాద్, బేగరి వినోద్ కుమార్, యువ మోర్చా మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బేగరి శివప్రసాద్, కుర్లెపు గంగాధర్, బేగరి సాయికుమార్, మహిళా మోర్చా అధ్యక్షులు నాగ రాజకుమారి, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎర్రోళ్ల గంగాధర్, జీలకర్ర విజయ్, గుడిసె ప్రభాకర్, కోశాధికారి కటిక రామరాజ్, శానం బాలాజీ, ఎర్రోళ్ల శ్రీనివాస్, అలపర్తి మురళి, శంకర్, పోతురాజు శ్రీనివాస్, మండల సీనియర్ నాయకులు బీవీ గుప్త, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Meeting on local body elections

More articles

Latest article