29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆధునిక సౌకర్యాలతో వైద్య సేవలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ:

ప్రముఖ వైద్యుడు కిశోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలతో జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో శ్రీ సిగ్మా ఆస్పత్రి గురువారం ప్రారంభమైంది. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్డియాలజీ, ఆర్థో, న్యూరో, జనరల్ సర్జన్, యూరాలజిస్ట్, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని ఆసుపత్రి చైర్మన్ గడీల శ్రీ రాములు తెలిపారు. హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రులకు  దీటుగా శ్రీ సిగ్మా ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తామన్నారు.  సీనియర్ వైద్య నిపుణులతోపాటు స్కానింగ్ సెంటర్, సిటీ స్కాన్, ఎక్సరే, నూతన టెక్నాలజీతో ల్యాబ్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. డైరెక్టర్లు, ఆర్గనైజర్లు, గాదరి గోపి, ప్రముఖ వ్యాపారవేత జయసింహగౌడ్, ధనలక్ష్మి, వెంకటేశ్, ప్రముఖ న్యూస్ ఛానల్ డైరెక్టర్ గాదె కృష్ణ, రవీందర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article