26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఉమ్మడి జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్స్

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి జిజిహెచ్ సూపరింటేండేంట్ గా వెంకటేశ్వర్ బాధ్యతల స్వీకరణ

 

నిజామాబాద్/ కామారెడ్డి, బతుకమ్మ :  నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఈ నెల 6న మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్, బోధన ఆసుపత్రుల పాలన అధికారులను నియమించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్  కృష్ణ మోహన్ బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి  మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ప్రొ.డాక్టర్ వాల్య గురువారం కళాశాలలో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు నూతన ప్రిన్సిపాల్స్ కు కళాశాల అధికారులు సిబ్బంది స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండుంట్ గా డాక్టర్ వెంకటేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. వారికి ఇంచార్జీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఫరిదా బేగం, అధికారులు స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటుండుంట్ గా నియమితులైన  ప్రొ.కృష్ణ మాలకొండ రెడ్డి బాధ్యతలు స్వీకరించలేదు. అయన విధులలో చేరికపై ప్రతిష్టంభన కొనసాగుతుంది.

Medical college principals who took charge in the joint district

More articles

Latest article