28.8 C
Hyderabad
Monday, August 3, 2026

అమ్మవారి దయతో గ్రామం సస్యశ్యామలంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సర్పంచ్ లోకాని గంగామణి గంగారం

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ సర్పంచ్, గ్రామస్తుల ఆధ్వర్యంలో భారీగా డప్పు చప్పుడులతో, కోలాటాలతో, బోనాలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ లోకాని గంగామణి గంగారం మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, గ్రామం సస్య స్యామలంగా ఉండాలని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ డైరెక్టర్లు, మాజీ వి డి సి చైర్మన్ లు, నూతన గ్రామ పాలకవర్గ వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article