29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మార్కెట్ వాల్యూ అప్డేషన్ వేగవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఫామ్ 1,2,3,4 అప్డేషన్ త్వరితగతిన చేపట్టాలి

 

. . . ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ లోకేష్ కుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

హైదరాబాద్ నుండి చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్ కుమార్, రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్కెట్ వాల్యూ అప్డేషన్ పై శనివారం సమీక్ష నిర్వహించారు.

 

Market value update should be expedited

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ వాల్యూ అప్డేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. భూభారతి ఐజీఆర్ఎస్ పోర్టల్‌లో ఫామ్ 1, 2, 3, 4లకు సంబంధించిన అప్డేషన్ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని సూచించారు.

 

Market value update should be expedited

 

జీవో నెంబర్ 44 ప్రకారం జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి మార్కెట్ వాల్యూ సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. భూ లావాదేవీలు, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెంపుతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

 

Market value update should be expedited

More articles

Latest article