29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ఒకరిని గురువారం అరెస్ట్ చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ సుందర్ సింగ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కామారెడ్డి మండలం నర్సన్న పల్లి రైల్వే గేట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అహ్మద్ బిన్ అసద్ వద్ద ఎండు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నాడని గుర్తించి  అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 550గ్రాముల ఎండు గంజాయి, ఒక ద్వి చక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.  కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ దాడుల్లో ఎస్ఐ శరత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ బాల్ రెడ్డి, ఆయోస్, అభిషేక్, కానిస్టేబుళ్లు మారుతి, శ్రీకాంత్ రెడ్డి, సవీన్ కుమార్, సరిత, అపూర్వ, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article