నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అక్రమంగా అమ్ముతున్న ఎండు గంజాయిని శుక్రవారం పట్టుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిజామాబాద్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు నగరంలోని జకీర్ ఫాం హౌస్ లో దాడి చేసీ తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో షేక్ షకీల్, దాశీ దాతూరాం, దాగే మధుకర్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 184గ్రాముల ఎండు గంజాయి, ముబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎవరైనా గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే 8712658970 నంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ దాడుల్లో పి.స్వప్న, బి.రామ్ కుమార్, హమీద్, శివ, ఉత్తమ్, అవినాశ్, బోజన్న, విష్ణు, రాజన్న పాల్గొన్నారు.
