31 C
Hyderabad

ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ:  జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఓవ్యక్తి వద్ద పోలీసులు గంజాయి పట్టుకున్నారు. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి. రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కాపు కాసి అనుమానాస్పదంగా తిరుగుతున్న బీస ప్రవీణ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా 250 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది.  నిందితుడు నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎలవాత్ గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి పట్టివేతలో కీలకపాత్ర పోషించిన ఎస్సై మొగులయ్య, సిబ్బంది ని అధికారులు అభినందించారు.

More articles

Latest article