కామారెడ్డి, బతుకమ్మ : నిషేధిత గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి రూరల్ సీఐ తెలిపారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు రామారెడ్డి బ్రిడ్జీ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారని తెలిపారు. ఒక కారు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఐదుగురిని పట్టుకుని విచారించగా గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 445గ్రాముల గంజాయి, నాలుగు ఫోన్లు, ఒకకారు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిజామాబాద్ కు చెందిన రాథోడ్ రవి, కామారెడ్డికి చెందిన దేవుని పృథ్వీ, నిజామాబాద్ కు చెందిన సయ్యద్ సాజిద్, కామారెడ్డికి చెందిన నిట్టూరు సిద్ధార్థ రావు, కామారెడ్డికి చెందిన పసులోటి భాను చందర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
