24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజాంపాలనలో అనేక దారుణాలు 

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్,బతుకమ్మ : నిజాంపాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో ధైర్య సాహసాలు చూపించి హైదరాబాద్ ను దేశంలో విలీనం చేశారన్నారు. దీంతో నిజాం పాలన నుంచి సంస్థానానికి విముక్తి లభించిందన్నారు. ఇందుకు గుర్తుగా హైదరాబాద్ విమోచ దినం నిర్వహిస్తున్నామన్నారు. దేశ ఐక్యత కోసం మన సైనికులు అనే త్యాగాలు చేశారన్నారు. అణుముప్పులకు నవ భారతం భయపడదు అని తెలిపారు. ధార్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో స్వస్థ్ నారీ- సశక్త్ పరివార్, రాష్ట్రీయ పోషణ్ మహ్ కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం, మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను , దేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ పథకాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 3,159 మెడికల్ క్యాంప్స్  ఏర్పాటు చేయనున్నారు.

More articles

Latest article