29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

చిక్కడపల్లిలో హనుమాన్ స్వాములకు మండల బిక్ష

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో ఆదివారం హనుమాన్ స్వాములకు మండల బిక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సద్గురు మహదేవ్ స్వామి హాజరయ్యారు. భక్తులను ఉద్దేశించి పలు ప్రవచనాలు చేసి హిందూ సాంప్రదాయం సనాతన ధర్మం గురించి వివరించారు. నాటి నుంచి నేటి వరకు మానవుని నడవడికలో మార్పులు సహజమని కానీ సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలను మరువకుండా పాటించడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్వామి సద్గురు మహాదేవ స్వామి, పరమేష్ మహారాజ్, శివప్ప, సర్పంచ్ రమేష్, ఉపసర్పంచ్ కళ్యాణ్, గ్రామ పెద్దలు కుర్మరాజు, హనుమంతు, మల్లేష్, రాజయ్య, రాము, అశోక్, అంజయ్య, నవీన్, పోశెట్టి, గోపాల్, పెద్ద గంగారం భీమయ్య, గురు స్వామి రాజు, హనుమాన్ స్వాములు గ్రామస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article