24.1 C
Hyderabad
Monday, August 3, 2026

పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించిన మండల యువకుడు

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

బెంగళూరులో కర్ణాటక పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన పది కిలోమీటర్ల పరుగు పందెంలో కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఎస్కే షాదుల్లా పాల్గొని గోల్డ్ మెడల్ సాధించినట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన షాదుల్ కర్ణాటక పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించి అక్టోబర్ లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడని తెలిపారు. గ్రామానికి చెందిన యువకుడు జాతీయస్థాయి పరువు పందెం పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.

More articles

Latest article