నేడు మందకృష్ణ మాదిగ ఎల్లారెడ్డికి రాక

0 14,543

నాగిరెడ్డిపేట, బతుకమ్మ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ శనివారం ఎల్లారెడ్డి పట్టణానికి రానున్నారని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కుంటోల్ల యాదయ్య మాదిగ, మండల అధ్యక్షులు తొంట సాయిలు మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని బాలగౌడ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న వికలాంగుల, వృద్దుల, వితంతువులు, చేయూత పెన్షన్ దారుల సన్నహాక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై  మాట్లాడనున్నారని తెలిపారు. వచ్చేనెల హైదరాబాదులో తలపెట్టనున్న భారీ బహిరంగ సభకు వికలాంగులు వృద్ధులు వితంతువులు చేయుత పెన్షన్ దారుల పెన్షన్ పెంపు కోసం దిశా నిర్దేశం చేయనున్నారని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన  హామీ మేరకు వికలాంగులకు 6000 పెన్షన్, చేయూత పెన్షన్ దారులకు 4000 పెన్షన్ ఇస్తానన్న మాట ప్రభుత్వం నిలబెట్టుకోలేదని పెన్షన్ల పెంపు, నూతన పెన్షన్ దారులను గుర్తించి తక్షణమే ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగిందని కావున మండలంలోని వృద్ధులు వితంతువులు, వికలాంగులు చేయూత పెన్షన్ దారులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు కోరారు.

Leave A Reply

Your email address will not be published.