25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రౌండ్ టేబుల్ సమావేశానికి మంద కృష్ణ మాదిగ రాక

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మార్పీయస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేశ్ మాదిగ

 

వేల్పూర్, బతుకమ్మ : వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ఫించన్ల పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ 18న జిల్లా కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీయస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేష్ మాదిగ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మార్పీయస్ మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ హాజరైఔతున్నారని ఆయన వెల్లడించారు. ఇట్టి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వృద్ధులు, వితంతువులు, వికలాంగులను ఏకం చెయ్యాలని సూచించారు. ఈ పెన్షన్ల పెంపు పై చర్చకు అధికార, ప్రతిపక్ష, మిత్రపక్ష వామ పక్ష పార్టీల నాయకులతో చర్చ, బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఇట్టి బహిరంగ సభ విజయవంతానికి ఎమ్మార్పీయస్ నాయకులు కృషి చేయాలని రాజేష్ కోరారు. ఈ సమావేశం లో మండల ఎమ్మార్పీయస్ ప్రెసిడెంట్ తెడ్డు శివరాజ్ మాదిగ, మండల జనరల్ సెక్రటరీ బక్కోళ్ల ప్రశాంత్ మాదిగ, మండల సెక్రటరీ సుమన్ మాదిగ సీనియర్ నాయకులు బాలకిషన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article