ఏర్గట్ల, బతుకమ్మ :
తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాళ్ల రాంపూర్ గ్రామానికి చేరుకున్న ఆయన, పావని భర్త భాను, కుమారులు భవిత్, భవిన్‌లను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మానాల మోహన్ రెడ్డి, ఈ క్లిష్ట సమయంలో దేవుడు వారికి అండగా ఉండాలని ఆకాంక్షించారు. స్వర్గస్తురాలైన బెజ్జారపు పావని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన ఇద్దరు కుమారులను చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పావని మరణం తాళ్ల రాంపూర్ గ్రామానికి తీరని లోటని పేర్కొన్న మానాల మోహన్ రెడ్డి, ఆమె చురుకైన ప్రజా ప్రతినిధిగా గ్రామాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. రాజకీయ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో ఆమె స్నేహపూర్వకంగా, గౌరవ మర్యాదలతో మెలిగేవారని గుర్తు చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సోమ దేవ రెడ్డి, ఆడెం గంగ ప్రసాద్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్, ఏర్గట్ల ఉపసర్పంచ్ సున్నపు లక్ష్మి శ్రీనివాస్, ఎండి మునీర్, రోక్కెడ సంజీవ్, జుంగల గణేష్, దొబ్బల మహేష్, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి, వైస్ చైర్మన్ నర్సారెడ్డి, కమ్మర్‌పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గంలోని పలువురు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, డొంకేశ్వర్ మండల సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
