సర్పంచ్ పావని కుటుంబాన్ని పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి
ఏర్గట్ల, బతుకమ్మ : తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాళ్ల రాంపూర్ గ్రామానికి చేరుకున్న ఆయన, పావని భర్త భాను, కుమారులు భవిత్, భవిన్‌లను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మానాల మోహన్ రెడ్డి, ఈ క్లిష్ట సమయంలో దేవుడు వారికి అండగా ఉండాలని...