నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఐదో టౌన్ ఎస్ఐ గంగాదర్ తెలిపారు. నగరంలోని వర్ని చౌరస్తాలో పోలీసులు సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. బోదన్ పట్టణంలోని శక్కర్ నగర్ కు చెందిన సయ్యద్ ఇషాక్ అతిగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో సయ్యద్ ఇషాక్ ను మంగళవారం కోర్టు ముందు హాజరు పరచగా మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించారు. పట్టణ పరిధిలో ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
