25.2 C
Hyderabad

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వ్యక్తి హత్య

Man murdered for standing in the way of an extramarital affair

Must read

📰 Generate e-Paper Clip

 

. . . భర్తను హత్య చేసిన భార్య ఆమె ప్రియుడు అరెస్ట్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడమే కాకుండా తరుచూ గొడవ పడుతున్న భర్తను అడ్డు తొలగించుకునేందుకు గొంతుపిసికి హత్య చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ హెచ్ వో బూక శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ హెచ్ వో మాట్లాడుతూ నగరంలోని కొజ్జాకాలనీలో సజ్జాద్ ఖాన్ తన భార్య ఫర్హానా బేగం, నలుగురు పిల్లలతో కలిసి ఉండేవాడని తెలిపారు. భార్య, భర్తలు ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోశించుకునే వారని ఇదే క్రమంలో ఫర్హానా బేగంకు షేక్ మన్సూర్ తో ఏర్పడిన వివాహేతర సంబంధానికి దారి తీసిందని తెలిపారు. ఈ విషయం తెలిసిన సజ్జాద్ ఖాన్ భర్యతో తరుచూ గొడవ పడి కొట్టేవాడని తెలిపారు. భర్తను అడ్డుతొలగించుకుంటే చాలని ఫర్హానా బేగం పథకం  రచించిందని, ఈ నెల 14న రాత్రి షేక్ మన్సూర్  ను ఇంటికి రప్పించిందని తెలిపారు. మద్యం మత్తులో ఉన్న షేక్ సజ్జాద్ ను టవల్ తో గొంతుకు ఉరి బిగించి హత్య చేశారని తెలిపారు. ఆదివారం ఉదయం తన భర్త  చనిపోయాడని నాటకం ఆడేందుకు ప్రయత్నించిన గొంతుపై ఉన్న గాయాల ఆధారంగా సజ్జాద్ ది ఆత్మహత్య కాదు హత్యగా నిర్ధారించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి భర్తను హత్య చేసిన భార్య ఫర్హానా బేగం, ఆమె ప్రియుడు షేక్ మన్సూర్ లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ హెచ్ వో తెలిపారు.

More articles

Latest article