28.2 C
Hyderabad

మెయినాబాద్ టీపీవో గుండు వాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

Case of assets disproportionate to known sources of income filed against Moinabad TPO Gundu Vani

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సోదాలలో కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు

 

సంగారెడ్డి, బతుకమ్మ :

 

మొయినాబాద్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్న గుండువాణిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు కేసులు నమోదు చేశారు. మొత్తం 6 కోట్ల 76 లక్షల 40 వేల 798 రూపాయల విలువైన ఆస్తులుగా గుర్తించగా బహిరంగ మార్కెట్లో దాదాపు 50 కోట్ల పై చిలుకు ఆస్తులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 30న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో టీపీవోగా పని చేస్తున్న గుండువాణి పంచాయితీ కార్యదర్శి ద్వారా రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెల్సిందే. ఏసీబీ అధికారులు గుండువాణిని కస్టడీలోకి తీసుకుని విచారించగా ఆదాయానికి మించిన ఆస్తులు బహిర్గతమయ్యాయి. ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో రెండు ఓపెన్ ప్లాట్లు, జనగామ జిల్లా పాలకుర్తిలో మరొక ప్లాట్లు గుర్తించారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.87.65 లక్షలుగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అక్తాపూర్ లో రూ.63 లక్షల విలువైన రెసిడెన్షీయల్ ప్లాట్ ను గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలోని జీప్లస్ టూ భవనాన్ని గుర్తించగా దాని విలువ రూ.2.40 లక్షలుగా లెక్కలు తేల్చారు. మహబూబ్ నగర్ జిల్లా కోవిల కొండ మండలంలో ఒక ఎకరం 10 గుంటల వ్యవసాయ భూమిని గుర్తించారు. దాని విలువ రూ.29.70 లక్షలుగా తేల్చారు. రూ.5,47,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ లోని తుల్జాభవనీ వైన్స్ లో రూ.50 లక్షలతో  షేర్ కలిగి ఉన్నట్లు గుర్తించారు. కోటి 30 లక్షలను వివిధ షేర్ ల రూపంలో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. బ్యాంక్ లో 7,97,238 రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. 2 లక్షల 54 వేల బంగారు ఆభరణాలను, 48 లక్షల విలువైన రెండు కార్లను, 2 లక్షల విలువైన రెండు బైక్ లను ఇంటిలో 5.10 లక్షల విలువైన గృహోపరకరణాలను గుర్తించారు.

More articles

Latest article