27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Must read

📰 Generate e-Paper Clip

కోటగిరి, బతుకమ్మ :  రైసు మిల్లు గోడ కూలి తన కొడుకు, మనుమరాలు చనిపోతే మిల్లు యజామాని నుంచి పరిహరం ఇప్పిస్తామని కేసును రాజీ చేసిన పెద్ధ మనుషులు మాట తప్పడంతో ఓ తండ్రి హైటెన్షన్ విద్యుత్  టవర్ ఎక్కి ఆత్మహత్యయత్నం చేశారు. కోటగిరి మండల కేంద్రంలో హై ఓల్టేజీ విద్యుత్  స్తంభం ఎక్కి వ్యక్తి చేసిన  ఆత్మహత్య యత్నం పోలీసులను సోమవారం టెన్షన్ పెట్టించింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  గత రెండు నెలల క్రితం కోటగిరి మండల కేంద్రంలో పాడుబడ్డ రైస్ మిల్ గోడకూలి ఇందూర్ మహేష్(25) అనే యువకుడు తన రెండు నెలల కుతూరు (చిన్నారి ) మృతి చెందిన ఘటన  కలిచిన విషయం అందరికీ తెలిసిందే. పాడు బడిన రైస్ మిల్ శిథిలావస్థకు చేరగా దానిని కుల్చివేయకపోవడంతో నిద్రలోనే తండ్రి, కుతూరు రైస్ మిల్ గోడ కూలి ఇంటిమీద పడటంతో దుర్మరణం చెందారు. తండ్రి కూతుర్లు మృతి చెందిన ఘటనపై  ఇందూర్ మహేష్ తండ్రి ఇందూర్ సాయిలు రైస్ మిల్ యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంధి పేరుతో వచ్చిన కొందరు గ్రామానికి చెందిన పెద్ద మనుషులు నష్టపరిహారం చెల్లిస్తామంటూ రాజీ కుదురుచగా ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించ లేదంటూ మృతుడి తండ్రి ఇందూర్ సాయిలు హై టెన్షన్ విద్యుత్ టవర్ పై ఎక్కి ఆత్మహత్యానికి యత్నించారు.  కేసులు తప్పించేందుకు వచ్చిన పెద్ద మనుషులు తమకు న్యాయం చేసే చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే ఇక్కడే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని భయభ్రాంతులకు గురిచేశాడు. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై సునీల్ బాధితుడికి ఫోన్ ద్వారా మాట్లాడి గ్రామస్తుల సమక్షంలో న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు.  ఎస్సై మాట మీద నమ్మకంతో ఇందూర్ సాయిలు కిందికి దిగడంతో సమస్య సద్దుమనిగింది.

Man attempts suicide by climbing high-tension electricity poleమృతి చెందిన తండ్రి, కూతురు (ఫైల్)

More articles

Latest article