29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మాల మహానాడు మండల కమిటీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు  సక్కి విజయ్ కుమార్ ఆద్వర్యంలో ఇందల వాయి మాల మహానాడు మండల కమిటీని జిల్లా కమిటీ  కార్యాలయం లో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా నీరడి గంగాధర్, ప్రధాన కార్యదర్శి గా పూజ్యం రవి కుమార్, ఉపాధ్యక్షులుగా అబ్బ శ్రీనివాస్, ఓడిగ గంగరాజ్యం, మల్లె శోభన్,  కోశాధికారిగా పాశం నర్సింలు, కార్యనిర్వహక కార్యదర్శి గా బైసీ సాయిలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు నీరడి గంగాధర్ మాట్లాడుతూ మాలల హక్కుల కోసం నిరంతరం  పోరాడుతానని,మాలల అభివృద్దే ద్యేయంగా ముందుకు సాగుతామని అన్నారు. జిల్లా కమిటీ సూచనల మేరకు మండల కమిటీ సభ్యుల సహకారం తో  ముందుకు పోతామన్నారు. ఎక్కడ మాలల కు అన్యాయం జరిగిన, మాలల పై దౌర్జన్యాలు, దోపిడీలు అరాచకాలు జరిగిన అక్కడ మాల మహానాడు కమిటీ ముందుంటందని అన్నారు.మాలల హక్కుల కోసమే మాల మహానాడు  నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మలాల సినియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article