- టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీయూసీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభలను జయప్రదం చేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి శ్రామిక భవన్లో శుక్రవారం విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టియుసిఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా లాదిమంది కార్మికులతో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి భారీ ర్యాలీ, పాత కలెక్టరేట్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. ఈ భారీ ర్యాలీ బహిరంగ సభలను జయప్రదం చేయాలని జిల్లాలోని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా టియుసిఐ ఆలిండియా అధ్యక్షులు కామ్రేడ్ అమ్రిష్ పటేల్ హాజరవుతారని, అదేవిధంగా జాతీయ కమిటీ నేతలు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వక్తలుగా హాజరవుతారన్నారు. 22 న రేడియో స్టేషన్ వద్ద గల ఆర్.ఎన్ ఫంక్షన్ హాల్ లో ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. ఈ సభలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన అతిథులు, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నాయకులు ప్రతినిధులుగా హాజరవుతారన్నారు. ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రారంభ ఉపన్యాసం చేస్తారన్నారు. ప్రతినిధుల సభలో గత పోరాటాలను సమీక్షించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామన్నారు. అదేవిధంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. రేపు జరిగే ర్యాలీ, బహిరంగ సభలను జిల్లాలోని బీడీ కార్మికులు, మున్సిపల్, గ్రామపంచాయతీ, కేజీబీవీ, మోడల్ స్కూల్, మిషన్ భగీరథ, భవన నిర్మాణ రంగం, ఆటో మోటారు, ఆశ, హమాలి రంగ కార్మికులు వేలాదిమంది తరలి, మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, జిల్లా నాయకులు పి.సాయన్న నాయకులు డి.గంగాధర్, ఎం.సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
