వామపక్ష ప్రజాస్వామ్య వాదులను గెలిపించండి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులతో పాటు వామపక్ష ప్రజాతంత్ర వాదులను గెలిపించుకొని పట్టణాల అభివృద్ధికి సహకరించాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం సీపీఎం పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడం కొరకు బిజెపి ప్రయత్నం చేస్తుందని, ప్రజలు దీన్ని ఐక్యంగా తిప్పి కొట్టాలని,...