29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రభుత్వ పాఠశాలల బంద్ ను విజయవంతం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

  • విద్యార్థి సంఘాల నాయకులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరిగే ప్రభుత్వ పాఠశాల బంద్ ను విజయవంతం చేయాలని  ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామ్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శుక్రవారం వాపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు బి.రఘురామ్, జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఫుడ్ పాయిజన్ తో 51 మంది విద్యార్థులు చనిపోయారని తెలిపారు. ముఖ్యంగా గురుకుల ,కేజీవిపి, ఆశ్రమ పాఠశాలు, ప్రభుత్వ స్కూల్స్ లో తరచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. నాణ్యమైన పోషక ఆహారం పెట్టడటం లేదని, సంబంధిత విద్యాశాఖ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సరైంది కాదని మండిపడ్డారు. పుడ్ పాయిజన్ తో చనిపోయిన విద్యార్థులకు ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించే బంద్ కి విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు నరేందర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు కుషాల్, పీడీఎస్యూ ఆర్మూర్ డివిజన్ అద్యక్షులు  ప్రిన్స్, పీడీఎస్యూ జిల్లా నాయకులు మనోజ్,రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article