సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

0 15,274
  • టీయూసీఐ  రాష్ట్ర ప్రధానకార్యదర్శి కే.సూర్యం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని టీయూసీఐ  రాష్ట్ర ప్రధానకార్యదర్శి కే.సూర్యం పిలుపునిచ్చారు.  ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జిల్లా కమిటీ సమావేశం కోటగల్లిలోని శ్రామిక భవన్ లో గురువారం నిర్వహించారు.  ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సూర్యం మాట్లాడుతూ గత 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగినాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువైందన్నారు.  మోడీ ప్రభుత్వం అవలంబించిన కార్పోరేట్ కంపెనీల అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కనీస వేతనాల అమలు కోసం, కనీస  పెన్షన్ 9వేల అమలు కోసం, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లకు  వ్యతిరేకంగా, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.  ఈ సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న డి.రాజేశ్వర్ జిల్లా నాయకులు లక్ష్మణ్, సాయన్న, రెహనా, రాజేశ్వర్, కిరణ్, విటల్, లింగం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.