సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
టీయూసీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కే.సూర్యం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని టీయూసీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కే.సూర్యం పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జిల్లా కమిటీ సమావేశం కోటగల్లిలోని శ్రామిక భవన్ లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సూర్యం మాట్లాడుతూ గత 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగినాయని,...