27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

25న ధర్నాను విజయవంతం చెయ్యండి

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  21 ప్యాకేజ్ పనులు ప్రారంభం చేయాలనీ ఈ నెల 25న  కలెక్టర్ రేట్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చెయ్యండని  ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సెగ్మెంట్ కు నీళ్లు ఇచ్చేందుకుగాను మోపాల్ మండలంలోని మంచిప్ప ప్రాజెక్టు నీటిని 2623 వేల కోట్ల రూపాయల  అంచనా  వ్యయంతో నిర్మించ  తలపెట్టిన 21 ప్యాకేజ్ పనులు సకాలంలో పూర్తి కాలేదని అన్నారు. 2022 లో వ్యయం ను రీవైజ్ చేస్తూ 3650 కోట్లు కు పెంచిన ప్రభుత్వం వాటికి నిధులు కేటాయించలేదని, ఈ మొత్తం పనులు పూర్తి కావడానికి మరొ 2000  వేల కోట్లు రూపాయలు విడుదల చేయాలని డిమాండు చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 6 మండలాలలోని 77 గ్రామాలు, వాటి అనుబంధ తండాలకు 84 వేల ఎకరాలకు  నీళ్లందుతాయని. దీనితోపాటు ఈ ప్రాంత చెరువులు, కుంటలు నింపవచ్చునని,ఈ పనులు 50%వరకే పూర్తయినాయిని. మిగతా పనులను టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని అన్నారు.  రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన, రైతు రాజ్యం, రైతు నేస్తం అంటూ మాటలు మాట్లాడుతుంది కానీ చేతలలో చూపించడం లేదని. మధ్యలో అర్థంతరంగా ఆగిపోయిన 21 ప్యాకేజీ పనులకు తగిన నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. వెంటనే 2000 కోట్లు కేటాయించి పనులను పూర్తి చేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని అన్నారు. రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ 21 ప్యాకేజీ పనులను పూర్తి చేయడానికి గాను ప్రభుత్వం వెంటనే రెండు వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలి. ప్రాజెక్టు ఎత్తు పెంచకుండా ప్రభుత్వం జీవో విడుదల చేసి పనులు ప్రారంభించాలని ఏఐకేఎంఎస్ ప్రభుత్వన్నీ డిమాండ్ చేస్తుందిని అన్నారు.  ఈ కార్యక్రమం లో సీపీఐఎంఎల్ న్యూడేమోక్రసి మండల కార్యదర్శి జేపీ.గంగాధర్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్,దేవస్వామి, ఏఐకేఎంఎస్ నాయకులు గంగాధర్, గంగదాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article